జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయన్‌ను ఆహ్వానించారు. భూ కుంభకోణం ఆరోపణలతో మనీలాండరింగ్ కేసులో 2024 జనవరి 31న హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసింది. అంతకు ముందు పార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఆయన సీఎం పదవీకి రాజీనామా చేశారు.
జూన్ 28న జైలు నుంచి విడుదలైన సోరెన్ దాదాపు 5 నెలల తర్వాత మనీలాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చంపై సోరెన్ తన రాజీనామాను బుధవారం గవర్నర్‌కు అందించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు జేఎంఎం చీఫ్ దావా వేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
