జార్ఖండ్ 11వ  ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం

జార్ఖండ్ 11వ  ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం

జార్ఖండ్ 11వ  ముఖ్యమంత్రిగా  JMM చీఫ్ హేమంత్  సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మోరాబది గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో  గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.  కాంగ్రెస్ నుంచి అల్మగిర్ అలమ్, రామేశ్వర్ ఓరన్ , ఆర్జేడీ నుంచి సత్యానంద్ బోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాగల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,  డీఎంకే చీఫ్ స్టాలిన్, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్  సోరెన్ ప్రమాణానికి హాజరయ్యారు.  తాజా మాజీ బీజేపీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కూడా వచ్చారు.  జార్ఖంఢ్ ముఖ్యమంత్రి పగ్గాలు 2వ సారి చేపట్టారు హేమంత్ సోరెన్.