‘హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ..ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‘హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ..ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చి.ల.సౌ, హిట్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో చిత్రాలతో ఆకట్టుకున్న రుహాని శర్మ.. ‘హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహిస్తుండగా రఘు సంకురాత్రి, దీపా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌ సంస్థ ద్వారా జులై 21న ఈ సినిమా థియేటర్స్‌‌‌‌‌‌‌‌లోకి వస్తోంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను నిర్మాత డి. సురేష్‌‌‌‌‌‌‌‌ బాబు రిలీజ్ చేసి, టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.