రైల్లో పేలిన గ్యాస్ సిలిండర్ ఇదే.. 10కి చేరిన మృతులు

రైల్లో పేలిన గ్యాస్ సిలిండర్ ఇదే.. 10కి చేరిన మృతులు

తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్​లోని ఓ రైలులో ఆగస్టు 26 ఉదయం గ్యాస్​ సిలిండర్​పేలిన విషయం విదితమే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ ఘటనకు కారణమైన గ్యాస్​ సిలిండర్​ని అధికారులు గుర్తించారు. 

చిత్రంలో మీరు చూస్తున్నది 10 మంది ప్రాణాలు బలికొన్న గ్యాస్​సిలిండరే. దాని పేలుడుకు గల కారణాలు కనుక్కునే పడ్డారు అధికారులు. ఉదయం జరిగిన ఘటనలో  రైలులోని 60 మందికి పైగా గాయపడ్డారు.క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్​కిచెన్ లోని సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.  

మృతులను ఉత్తర ప్రదేశ్ వాసులుగా గుర్తించారు.  రామేశ్వరం నుంచి కన్యాకుమారి వైపు వెళ్తున్న ఈ ట్రైన్ ఘటనపై జిల్లా కలెక్టర్  దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.