
హైదరాబాద్, వెలుగు: డెయిరీ బ్రాండ్హెరిటేజ్ ఫుడ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ), ఇండియా కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఎక్సలెన్స్ కోసం అందించే గోల్డెన్ పీకాక్ అవార్డు 2025ను గెలుచుకుంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ లలిత్ అధ్యక్షతన నియమించిన జ్యూరీ దీనిని సిఫార్సు చేసింది.
హెరిటేజ్ ఫుడ్స్ తన కార్యకలాపాలలో ఆదర్శప్రాయమైన కార్పొరేట్ గవర్నెన్స్ పద్ధతులను అమలు చేయడం వల్ల గోల్డెన్ పీకాక్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు తమ కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్సలెన్స్‌కు గుర్తింపు అని కంపెనీపేర్కొంది. ఈ అవార్డు నవంబర్ 4న లండన్‌లో జరిగే కార్యక్రమంలో అందజేస్తారు.