
అజిత్ లాంటి స్టార్‌తో ఒక సినిమా చేసే అవకాశం రావడమే కష్టం. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేశారు దర్శకుడు హెచ్.వినోద్, నిర్మాత బోనీకపూర్. ‘నెర్కొండ పార్వై’తో పాటు ఇటీవల విడుదలైన ‘వలీమై’ వీళ్ల కాంబినేషన్‌లోనే వచ్చాయి. ఇప్పుడీ ముగ్గురూ కలిసి మూడో సినిమా చేయబోతు న్నారు. ఈ సినిమాలో తన లుక్ విషయమై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు అజిత్. సాధారణంగా హీరోల గెటప్‌కు సంబంధించిన లుక్ ఎలా ఉండాలో డైరెక్టర్స్ ఫైనల్ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకి మాత్రం తన లుక్‌ని అజితే స్వయంగా డిజైన్ చేసుకుంటున్నాడట. స్క్రిప్ట్ నెరేట్ చేసేటప్పుడే ఓ లుక్‌కి ఫిక్స్ అయిన అజిత్, ఇందుకోసం గుబురు గడ్డం పెంచాడు. ఇటీవల బోనీ కపూర్ రివీల్ చేసిన ప్రీ లుక్‌లోనూ అజిత్ కళ్లజోడు, గడ్డంతో కనిపించాడు. ఇక ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్నారు. డిఫరెంట్ స్టోరీలైన్‌తో ‘వలీమై’ని మించి గ్రాండియర్‌గా ఉండబోతోంది అంటున్నారు.