సెల్యూట్ సార్ : పాముకు గుండెపోటు.. పాము నోట్లో నోరు పెట్టి.. సీపీఆర్ చేసి కాపాడిన పోలీస్

సెల్యూట్ సార్ : పాముకు గుండెపోటు.. పాము నోట్లో నోరు పెట్టి.. సీపీఆర్ చేసి కాపాడిన పోలీస్

ఇప్పుడు గుండెపోట్లు కామన్ అయ్యాయి.. ఏ నిమిషానికి ఏమి జరుగును అన్నట్లు జీవితం తయారైంది.. కళ్ల ముందు నిక్షేపంగా ఉన్న వ్యక్తి.. కను రెప్పపాటులో కుప్పకూలిపోతున్నాడు.. ఏమైందా అని దగ్గరకు వెళ్లే చూసి సరికి.. అతని గుండె ఆగిపోయి ఉంటుంది.. కరోనా తర్వాత ఇలాంటి ఘటనలు రోజూ వింటూనే ఉన్నాం.. చూస్తూనే ఉన్నాం.. ఇలాంటి ఘటన జంతువుల్లో వస్తే.. అది కూడా పాముకు వస్తే.. అప్పుడు ఏం చేయాలి.. ఎలా కాపాడాలి.. మనిషికి చేసినట్లే పాముకు కూడా సీపీఆర్ చేయాలా.. అసలు పాము దగ్గరకు వెళ్లే సాహసం ఎవరైనా చేయగలరా.. అంత దైర్యం ఉందా.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఈ పోలీస్..

మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో అతుల్ శర్మ అనే పోలీసు కానిస్టేబుల్ పురుగుమందు కలిపిన విషపు నీటిలో పడి స్పృహతప్పి పడిపోయిన  పాముకు సీపీఆర్ చేసి రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కానిస్టేబుల్ అతుల్ శర్మ నోరును.. పాము నోట్లోకి పెట్టి గాలి ఊదుతూ కనిపించాడు. మొదట నిర్జీవంగా కనిపించిన ఆ పాము... శ్వాసనాళంలోకి గాలిని ఊదగానే ఉబ్బినట్లు కనిపించింది.

ఆ తర్వాత కాసేపటికి పాము స్పృహలోకి వచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 24న దసరా డ్యూటీలో ఉన్న తనకు నర్మదాపురంలోని తవా కాలనీ వాసులు తమ ఇంట్లోకి పాము వచ్చిందని ఫోన్ వచ్చింది. అతను ఇంటికి వెళ్లి చూడగా పాము పైపులో ఉన్నట్టు గమనించారు. కుటుంబ సభ్యులు అప్పటికే పురుగుమందులు కలిపిన నీటిని బకెట్లలో పోసి ఉంచడంతో ఆ పాము అందులో పడి అపస్మారక స్థితికి చేరుకుంది. తాము పామును బయటకు తీసి, సీపీఆర్ అందించానని.. పాము స్పృహలోకి రావడానికి దాదాపు గంట సమయం పట్టిందని అతుల్ శర్మ తెలిపారు. ఆ తర్వాత దాన్ని అడవిలో సురక్షితంగా విడిచిపెట్టామన్నారు. సెమీహార్‌చంద్ పోలీసు అవుట్‌పోస్ట్‌లో పోస్ట్ చేయబడిన వారు విలేకరులతో అన్నారు.

అయితే పాముకి CPRని అందించడం నిజంగా పని చేయదని, కొన్నిసార్లు అపస్మారక స్థితికి చేరిన తర్వాత పాము తనను తాను పునరుద్ధరించుకునే అవకాశం ఉందని పశువైద్యులు తెలిపారు. కానీ శర్మ పాముని రక్షించేందుకు CPR అందించడంతో ప్రశంసలు అందుకుంటున్నాడు. చింద్వారా జిల్లాకు చెందిన అతుల్.. ఐదేళ్లుగా పచ్‌మర్హి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. అతను 12వ తరగతి చదువుతున్నప్పటి నుండి పాములను పట్టుకోవడంలో నైపుణ్యం సాధించాడు.

ALS0 READ: 22మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు ఇతడే