'సార్' తొలి ప్రచార చిత్రం విడుదల

'సార్' తొలి ప్రచార చిత్రం విడుదల

స్టార్ హీరో ధనుష్ ద్విభాషా చిత్రం‌ 'సార్‌' (తెలుగు)/ 'వాతి' (తమిళం) తొలి ప్రచార చిత్రం విడుదలైంది. జులై 28న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. కాగా ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈ ప్రచార చిత్రంలో ధనుష్ 'సార్' ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా, దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేనికి సిద్ధమవుతున్నారు లాంటి ప్రశ్నలన్నింటికీ 'సార్' సమాధానం వెండితెర మీద చూడాల్సిందేనని చిత్ర నిర్వాహకులు అంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ధనుష్ పుట్టినరోజు నాడు అనగా రేపు సాయంత్రం 6 గంటలకు వీడియో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

ప్రొడ‌క్షన్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
సినిమాటోగ్రాఫ‌ర్:  జె.యువరాజ్
మ్యూజిక్: జి.వి. ప్రకాష్‌కుమార్‌
యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్
స‌మ‌ర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. - సాయి సౌజ‌న్య‌
రచన- దర్శకత్వం: వెంకీ అట్లూరి
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్