ఐకాన్ మూవీ హీరో మారాడు..

ఐకాన్ మూవీ హీరో మారాడు..

వకీల్ సాబ్(Vakeel Saab) హిట్ తర్వాత వేణు శ్రీరామ్((Venu Sriram). నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఆ మధ్య వకీల్ సాబ్ 2 ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించిన మళ్ళీ ఎటువంటి సమాచారం లేదు. తాజాగా వేణు శ్రీరామ్ నుంచి అదిరిపోయే అప్డేట్ రానుందని సమాచారం. గతంలో అల్లు అర్జున్(Allu Arjun) తో అనుకున్న ఐకాన్(Icon) స్టోరీ నే ఇప్పుడు నితిన్(Nithin) తో తీస్తున్నారని తెలుస్తోంది.ఇప్పుడు ఐకాన్ కథని నితిన్ కు వినిపించాడని..మూవీ కూడా ఒకే అయినట్టు తెలుస్తోంది.
 
ఐకాన్ అనగానే గుర్తుకొచ్చే అల్లు అర్జున్ తో సినిమా కాకుండా..నితిన్ తో తీస్తున్న ఈ మూవీ టైటిల్ విషయంలో వేణు శ్రీరామ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన ఐకాన్ స్టోరీ నితిన్ కోసం మార్పులు కూడా చేసినట్టు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్న ఈ మూవీ నుండి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. 

ఇక నితిన్ మాచర్ల నియోజక వర్గం మూవీ బాక్సపీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం నితిన్, వక్కంతం వంశీ(Vakkantham Vamsi),వెంకీ కుడుమల(Venky kudumala) తో మూవీస్ చేయనున్నాడు.షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీస్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఇది పూర్తయిన తర్వాత వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.