నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు తప్పకుండా వస్తుంది : ఎన్టీఆర్

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు తప్పకుండా వస్తుంది : ఎన్టీఆర్

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు తప్పకుండా వస్తుందని హీరో జూనియర్ ఎన్టీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అవార్డు వేడుకలు జరిగే హాల్ లో మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్.. ఏ పాట కన్నా నాటు నాటు పాట తక్కువ కాదని, ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే అర్థమవుతుందన్నారు. ఎన్టీఆర్ కోటు ఎడమ భుజంపై టైగర్ బొమ్మ గురించి ప్రస్తావించగా భారతదేశ జాతీయ జంతువు పులి అని చెప్పాడు. ఇక అవార్డు కార్పెట్ పై వెళ్లేటప్పుడు నడిచేది తాను కాదని  ఇండియా అని తెలిపాడు. 

ఇక నాటు నాటు పాట తమది కాదని ప్రజల సాంగ్ గా మారిందని హీరో రామ్ చరణ్​ అన్నాడు. ఆస్కార్ అవార్డుల వేడుకకు తన భార్య ఉపాసనతో కలిసి వచ్చిన చరణ్..  ఈ పాటను వయసుతో సంబంధం లేకుండా అందరు సొంతం చేసుకున్నారని తెలిపాడు. పోటీలో నాటునాటుతో పాటుగా మరో నాలుగు పాటలు బరిలో ఉన్నాయి.  బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట పోటీ పడుతోంది.  కాగా ఇప్పటివరకు ఇండియాకు 8 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇందులో ఏఆర్ రెహమాన్  ను  వరుసగా రెండు సార్లు ఆస్కార్ వరించింది. జయహో పాటకు రెహమాన్  ఆస్కార్ అందుకున్నారు.