‘అమిగోస్‌’.. ఫ్యాన్స్తో కల్యాణ్‌రామ్‌ ముచ్చట్లు

‘అమిగోస్‌’.. ఫ్యాన్స్తో కల్యాణ్‌రామ్‌ ముచ్చట్లు

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్‌’. రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ జోరుగా చేస్తోంది. ఇందులో భాగంగా కల్యాణ్‌రామ్‌ ఫ్యాన్స్ తో ఫోన్‌లో మాట్లాడారు. సినిమా విశేషాలను తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ‘అమిగోస్’ అనేది ఓ స్పానిష్ పదమని.. దానికి ఫ్రెండ్స్ అని అర్థమని వివరించారు. అంతేకాదు బాలయ్య నటించిన సినిమాల్లోని ఓ సూపర్‌ హిట్‌ సాంగ్‌ను ఈ సినిమాలో రీమేక్‌ చేస్తున్నట్లు కల్యాణ్ రామ్ ఇంట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మీడియో వైరల్ అవుతోంది.

‘అమిగోస్‌’ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇదొక యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌‌లో కనిపించనున్నారు. ఆషిక రంగ‌‌నాథ్ హీరోయిన్‌‌గా న‌‌టిస్తోంది. బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాష్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  ఇప్పటికే విడుదలై టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.