
నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan ram) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెవిల్(Devil). ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్(The British Serete Agent) అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ నామ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు కళ్యాణ్ రామ్.
ఇక దేవర సినిమాకు కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందుకే డెవిల్ ట్రైలర్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతున్నప్పుడు దేవర అప్డేట్ గురించి అదేపనిగా అడిగారు ఫ్యాన్స్. దాంతో కళ్యాణ్ రామ్ దేవర సినిమా టీజర్ గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. తమ్ముడి సినిమా దేవర. లాస్ట్ ఈవెంట్ లో తమ్ముడు చెప్పాడు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వొద్దని. అయినా కూడా మీకు ఒకటి చెప్పలనుకుంటున్నా. ఆర్ఆర్ఆర్ లాటి సినిమా తరువాత హీరోకి గానీ, నిర్మాతకి గానీ, దర్శకుడికి గానీ ఎంత బాధ్యత ఉంటుంది. చిన్న విషయంలో తప్పు జరిగినా మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా.. అందుకే దేవర సినిమా కోసం చాలా జాగ్రత్తగా కష్టపడుతున్నాము. రేపు మీరు సినిమా చూసేటప్పుడు ఇంతకన్నా ఎక్కువగా అరవాలి. త్వరలో గ్లింప్స్ రాబోతుంది. దానికి సంబందించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఒక కొత్త ప్రపంచాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. అందుకోసం కాస్త సమయం పడుతుంది. దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే డేట్ కూడా అనౌన్స్ చేస్తాం.. అంటూ దేవర టీజర్ పై క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విరాళము గా మారింది. ఇక కళ్యాణ్ రామ్ చేసిన ఈ కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.