
ఆర్ఎక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ పెళ్లి ఘనంగా జరిగింది. తన ప్రియురాలు లోహితారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఇవాళ హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి మెగస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తనికెళ్ల భరణి పాయల్ రాజ్ పూత్, పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్తికేయ ప్రస్తుతం తమిళ హీరో అజిత్ మూవీ వాలిమైలో విలన్ గా చేస్తున్నాడు