
రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. వధువు మరెవరో కాదు తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ (Rahasya Gorak).గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ జరిగింది.
తాజాగా హీరోయిన్ రహస్య వీరిద్దరి పెళ్లి డేట్ పై క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేసింది.ఇవాళ జూలై 15న కిరణ్ అబ్బవరం బర్త్డే సందర్బంగా విషెస్ చెబుతూ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. అయితే,ఇందులో ‘రాజావారు రాణిగారు’సమయం నుంచి నిశ్చితార్థమైన నాటివరకూ వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు,వీడియోలతో స్పెషల్ వీడియో క్రియేట్ చేసి దాన్ని తమ అభిమానులతో పంచుకున్నారు.
ALSO READ | మహేష్ బాబు న్యూ లుక్ సూపర్బ్
‘‘హ్యాపీ బర్త్‌డే డియర్ కిరణ్ అబ్బవరం.మరో 38 రోజుల్లో నిన్ను..మై హస్బెండ్ అనేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా’’అని లవ్ సింబల్ తో ఆమె క్యాప్షన్ జత చేశారు.దీన్ని బట్టి చూస్తేకిరణ్,రహస్య గోరక్‌ల వివాహ తేదీని ఆగస్టు 21న నిర్ణయించినట్లు తెలుస్తోంది.మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే..రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య గోరఖ్ సినిమాల్లో నటించలేదు.చాలా ఏళ్ళ నుండి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు ఆమె. ఇక కిరణ్ అబ్బవరం మాత్రం హిట్స్,ఫ్లాప్స్ తో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో కెరీర్ లో మొదటి బ్రేక అందుకున్న ఈ హీరో..చాలా కాలం తరువాత వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ బాట పట్టాడు. ఇటీవల రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఆ సినిమాతో మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇప్పుడు సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకొని తాజాగా కొత్త సినిమా 'క'నుంచి టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.
ALSO READ | అభిషేక్, ఐశ్వర్యలు రూమర్లకు చెక్ చెప్పినట్లేనా..?