
సుహాస్ హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన మహేష్ బాబు టీమ్‌ని అభినందించాడు. సుహాస్, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్, నిర్మాతలు శరత్‌చంద్ర, అనురాగ్ రెడ్డిని ప్రశంసించారు. మహేష్ బాబు మాట్లాడుతూ ‘ఈ సినిమా చాలా ఎంజాయ్ చేశాను. హార్ట్ వార్మింగ్ ఫిల్మ్. ముఖ్యంగా క్లైమాక్స్ బాగుంది. ఫ్యామిలీస్ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది’ అని చెప్పాడు.