ఇటలీ మార్కెట్లోకి.. హీరో బైక్స్

ఇటలీ మార్కెట్లోకి.. హీరో బైక్స్

న్యూఢిల్లీ: టూవీలర్​  హీరో  మోటోకార్ప్, పెల్పి ఇంటర్నేషనల్‌తో పంపిణీ భాగస్వామ్యం ద్వారా ఇటలీ మార్కెట్​లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది.  ఈ యూరప్​ దేశంలోకి ప్రవేశించడం కంపెనీ ప్రపంచ విస్తరణ ప్రయాణంలో ముఖ్య మైలురాయని హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ భాన్ తెలిపారు. ఈ ప్రవేశంతో హీరో మోటోకార్ప్ అడుగుపెట్టిన అంతర్జాతీయ మార్కెట్ల సంఖ్య 49కి చేరుకుంది. 

కంపెనీ తన ప్రీమియం మోడల్స్ ఎక్స్‌‌‌‌పల్స్ 200 4వీ, ఎక్స్‌‌‌‌పల్స్ 200 4వీ ప్రో, హంక్ 440 లను ఇటలీలో అమ్మనుంది. తొలి దశలో 36 డీలర్లతో కీలక నగరాలపై దృష్టి సారించి, క్రమంగా 54 డీలర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఈ కొత్త భాగస్వామ్యం ద్వారా హీరో మోటోకార్ప్ ఉత్పత్తులకు 5 ఏళ్ల వారంటీని అందిస్తుంది. ఇటలీలో హంక్ 440, ఎక్స్‌‌‌‌పల్స్ 200 మోడళ్లు విజయం సాధిస్తాయనే నమ్మకం ఉందని పెల్పి ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.