హిట్ 3 ఇచ్చిన జోష్ తో ప్యారడైజ్ పై ఫోకస్ పెట్టిన నాని..

హిట్ 3 ఇచ్చిన జోష్ తో ప్యారడైజ్ పై ఫోకస్ పెట్టిన నాని..

ఓ వైపు ‘కోర్టు’ చిత్రంతో నిర్మాతగా, మరోవైపు ‘హిట్ 3’ చిత్రంతో హీరోగా వరుస విజయాలను అందుకుని ఫుల్ జోష్‌‌‌‌లో ఉన్నాడు నాని.  ప్రస్తుతం ‘హిట్ 3’ ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లాడు. ఈ సక్సెస్‌‌‌‌ను ఎంజాయ్ చేస్తూనే, తన నెక్స్ట్ ప్రాజెక్టుపై కూడా ఫోకస్ పెట్టాడు నాని. తను హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ప్యారడైజ్’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ‘హిట్ 3’ మూవీ  కోసం కొంత గ్యాప్ తీసుకున్న నాని.. ఇకపై ‘ప్యారడైజ్’కు టైమ్ కేటాయించడానికి ప్లాన్ చేశాడు. 

సోమవారం హైదరాబాద్‌‌‌‌ చేరుకోనున్న నాని.. కొంత విశ్రాంతి తీసుకుని ఈనెల 18 నుంచి ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన నాని లుక్, టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇందులో నాని  లార్జర్‌‌‌‌‌‌‌‌దేన్ -లైఫ్ పాత్రలో కనిపించనున్నాడు. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. 

ఈ  కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ను పాన్ వరల్డ్‌‌‌‌ మూవీగా రిలీజ్‌‌‌‌కు రెడీ చేస్తున్నారు.  ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో మరిన్ని  అంచనాలు ఏర్పడ్డాయి.