యాంకర్ ప్రదీప్ పెళ్లి వార్త చెప్పిన నాని.. వచ్చే ఏడాది కన్ఫర్మ్!?

యాంకర్ ప్రదీప్ పెళ్లి వార్త చెప్పిన నాని.. వచ్చే ఏడాది కన్ఫర్మ్!?

నేచురల్ స్టార్ నాని(Nani) యాంకర్ ప్రదీప్(Anchor Pradeep) పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దానికి ప్రదీప్ కూడా నీకు దండం సార్ అంటూ సిగ్గుపడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి తెలుగు బుల్లితెర సెలబ్రెటీస్ లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరైనా ఉన్నారంటే అది యాంకర్ ప్రదీప్ అనే చెప్పాలి. చాలా కాలంగా ఆయన పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 

ఆ మధ్య ప్రదీప్ పెళ్లిపై పెళ్లి చూపులు అనే ప్రోగ్రాం కూడా వచ్చింది. ఆ సమయంలో ప్రదీప్ నిజంగా పెళ్లి చేసుకుంటారని అనుకున్నారంతా కానీ.. అదంతా కేవలం ప్రోగ్రాం కోసమే అని తెలిసి షాకయ్యారు. ఇక అప్పటి నుండి ప్రదీప్ పెళ్లి వార్తలు అడపాదడపా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి వార్త వైరల్ గా మారింది. దానికి కారణం హీరో నాని.

ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. బేబీ కియారా నాని కూతురిగా నటించారు. ఫాథర్ అండ్ డాటర్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా.. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా.. ఢీ ప్రీమియర్ లీగ్ షోకు గెస్ట్ గా వచ్చారు నాని, మృణాల్ ఠాకూర్. ఇందులో భాగంగా నాని ప్రదీప్ పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. షోలో భాగంగా నానిని యాంకర్ ప్రదీప్.. మీ వైఫ్ అలిగితే బుజ్జగించడానికి మీరేం చేస్తారు.. అని అడిగాడు. దానికి నాని.. వచ్చే ఏడాది(2024) నీ పెళ్లి ఫిక్స్ అయిందటగా.. అని అడుగుతాడు. అప్పుడు ప్రదీప్.. అవన్నీ రూమర్లు సార్ ఎప్పటినుండో వస్తూనే ఉన్నాయి..అన్నాడు.ఇప్పుడు వస్తున్న రూమర్ చాలా స్ట్రాంగ్ సోర్స్ నుండి వచ్చింది అంటాడు నాని. అప్పుడు ప్రదీప్.. ఎవరు చెప్పినా పర్లేదయ్యా.. మీరు చెప్తే నిజమే అని జనాలు నమ్ముతారు సార్ అంటూ దండం పెడతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.