నాకు కూడా డ్రగ్స్ ఆఫర్ చేశారు.. అది డెత్ సెంటెన్స్ : హీరో నిఖిల్

నాకు కూడా డ్రగ్స్ ఆఫర్ చేశారు..  అది డెత్ సెంటెన్స్ : హీరో నిఖిల్

తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జూన్ 24 శుక్రవారం రోజున తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో యాంటీ డ్రగ్, డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటులు నిఖిల్ సిద్దార్థ, ప్రియదర్శిని రామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు.. సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ప్రభుత్వ కార్యదర్శి భారతి హోల్లికేరి IAS కూడా పాల్గొన్నారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రచారం నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలిపింది.

ఈ కార్యక్రమంలో సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నగరంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను కొద్దిరోజుల క్రితమే ప్రారంభించము. డ్రగ్స్ అనేది ప్రస్తుత సమాజంలో పెద్ద సమస్యగా మారింది. ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాల గురించి ఆలోచించకుండా తాత్కాలిక ఆనందాల కోసం డ్రగ్స్ కు ఎడిక్ట్ అవుతున్నారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో మార్పు రావాలని. ఈ అద్భుతమైన కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరారు. 

ఇక హీరో నిఖిల్ మాటాడుతూ.. నాకు కూడా చాలా మంది డ్రగ్స్ ఆఫర్ చేశారని, దానికి నేను నో చెప్పానని చెప్పుకొచ్చాడు. డ్రగ్స్ అనేవి చాల ప్రమాదకరం. అందుకే మనం దానికి దూరంగా ఉండాలి. ఒక్కసారి వాటికి అలవాటైతే.. అది డెత్ సెంటెన్స్. అందుకే సే నో టూ డ్రగ్స్. స్టూడెంట్స్ కు అందమైన జీవితం ఉంది. ఎంజాయ్ చేయండి కానీ.. డ్రగ్స్ అలవాటు చేసుకోవద్దు. ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యి. త్వరలోనే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణాను చూడాలని కోరుకుంటున్న అని చెప్పుకొచ్చాడు నిఖిల్. 

ఇక ఈ కార్యక్రమానికి హాజరైన మరి గెస్ట్ ప్రియదర్శి మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం నాకు సిగరెట్ అలవాటు ఉండేది కానీ.. కొంతకాలం క్రితం మానేశాను. ప్రస్తుతం ఇంలాటి సమస్య లేకుండా హ్యాపీ గా ఉన్నాను. ప్రస్తుతం పరిస్థితులలో డ్రగ్స్ గురించి అందరికీ అవగాహన రావాల్సి ఉంది. విద్యార్థులలో పరివర్తన రావాల్సిన అవసరం చాలా ఉంది. వారి కోసం ఇలాంటి అవెర్న్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్న నార్కోటిక్స్ విభాగానికి నా సెల్యూట్ అని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.  

ALSO READ:వీళ్లసంగతేంటీ : ప్రముఖ హీరోలు, నటీమణులతో.. డ్రగ్స్ కిలాడీ కేపీ చౌదరి ఫొటోలు