కొరటాల స్టోరీలైన్ కు ఇంప్రెస్ అయిన ప్రభాస్!

కొరటాల స్టోరీలైన్ కు ఇంప్రెస్ అయిన ప్రభాస్!

ఒకసారి సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రిపీట్ చేయాలనే కోరిక ఎంత పెద్ద స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోకయినా ఉంటుంది. కానీ అందుకు తగ్గ సమయం, సందర్భంతో పాటు కథ కూడా కలిసి రావాలి. ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొరటాల శివ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో అలాంటి సందర్భం వచ్చేసినట్టు తెలిసింది. రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న కొరటాలకు ‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా ప్రమోషన్ ఇచ్చాడు ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సినిమా సూపర్ సక్సెస్ కూడా సాధించింది. కానీ ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా రాలేదు. అయితే ఇటీవల కొరటాల ఓ స్టోరీ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినిపించినట్టు, ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమవ్వాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓకే చెప్పినా, ఈ ప్రాజెక్ట్ సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది.

కొరటాల ముందుగా ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఇక ప్రభాస్ సాలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత స్పిరిట్, సిద్దార్థ్ ఆనంద్ మూవీతో పాటు మారుతి సినిమా  చేయాల్సి ఉంది. మరి ఇవన్నీ పూర్తయ్యాకే కొరటాల మూవీ ఉంటుందా లేక మధ్యలోనే సమయం కేటాయిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి వంగా డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటించనున్న ‘స్పిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం కరీనా కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదిస్తున్నట్టు బాలీవుడ్ టాక్. ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ ‘ఆదిపురుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో కరీనా భర్త సైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య ప్రభాస్ పంపిన బిర్యానీ రుచి చూసి ‘బాహుబలి బిర్యానీ’ సూపర్ అంటూ థ్యాంక్స్ కూడా చెప్పింది కరీనా. దాంతో ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాకి కూడా ఓకే చెప్పేసి ఉంటుందని అంచనా. అఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్.