ఈ సిరీస్ను ఫ్యామిలీతో కలిసి చూడొద్దు: హీరో రానా

ఈ సిరీస్ను ఫ్యామిలీతో కలిసి చూడొద్దు: హీరో రానా

రానా నాయుడు సిరీస్ ను ఫ్యామిలీతో కలిసి చూడకండి అని హీరో రానా సూచించాడు. దగ్గుబాటి వెకంటేష్, రానా లీడ్ రోల్ లో నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షమాన్, సువర్ణ్  వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కు అడాప్టేషన్ గా తెలుగులో తెరకెక్కింది. ప్రధాన పాత్రల్లో బసుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి నటిస్తున్నారు. ఈనెల 10న నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇవాళ హైదరాబాద్ హోటల్ తాజ్ డెక్కన్ లో మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హీరోలు రానా, వెంకటేష్ పాల్గొన్నారు.

"ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడకండి..సింగిల్ గా చూస్తే మంచిది. ఓటిటి వచ్చాక సినీ ఇండస్ట్రీ ట్రెండ్ మారిపోయింది" అని రానా అన్నారు. "రానా మాములోడు కాదు. నేను చేయని ఎన్నో క్యారెక్టర్స్ వీడు చేసేసాడు. ప్రస్తుతం ఓటిటిలో ఉన్న కంటెంట్ ని ఫ్యామిలీతో చూడలేకపోతున్నాం..కానీ ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు. రానా నాయుడును ఫ్యామిలీతో చూడకూడదు" అని వెంకటేష్ తెలిపారు.