పాన్ ఇండియా లెవెల్లో.. హీరో రోషన్ మూవీస్

పాన్ ఇండియా లెవెల్లో.. హీరో రోషన్ మూవీస్

హీరో శ్రీకాంత్(Srikanth)  నటనలోన, తను ఎంచుకునే మూవీస్ తోను ఫ్యామిలీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan)  నటనలోనూ,స్క్రీన్ ప్రెజెన్స్ లోను మంచి మార్కులు తెచ్చుకున్నారు. తాజాగా రోషన్ రెండు కథలను ఎంచుకుని పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 

ఇప్పటికే డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం(Pradeep Advaitham) డైరెక్షన్ లో చేస్తున్న ఛాంపియన్(Champion) మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఇది విభిన్నమైన లవ్ స్టోరీ తో సినిమా ఉండబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి

వైజయింతి బ్యానర్ లో అశ్వినీదత్(Aswani Dutt) గారు ఈ మూవీను పాన్ ఇండియా లెవెల్లో తీయడానికి.. కథ విషయంలో నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీతో పాటు కన్నడ డైరెక్టర్ నంద కిషోర్(Nanda Kishore) తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు. ఈ మూవీ కు వృషభ(Vrushabha) అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) రోషన్ కి తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. పీరియాడికల్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా లో రోషన్ లుక్,పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది అని టాక్ వినిపిస్తోంది.  ఈ మూవీలో మోహన్ లాల్ ,రోషన్ మధ్య వచ్చే సీన్స్ హైలెట్ అవుతాయని తెలుస్తోంది. కాగా రోషన్ కి ఇప్పటి వరకు సరైన హిట్ లేకపోయినా..తన నుంచి పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు..

రోషన్ లుక్స్ ఇంకా క్రేజ్ నేపథ్యంలో అతడితో వర్క్ చేసేందుకు చాలా మంది తెలుగు దర్శకులతో పాటు పలు భాషలకు చెందిన దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.