వీలైతే చొక్కాలు చింపుకొని సినిమా చూడాలే..టపాసులు కాల్చుతూ కాదు..నెటిజన్స్ వార్నింగ్

వీలైతే చొక్కాలు చింపుకొని సినిమా చూడాలే..టపాసులు కాల్చుతూ కాదు..నెటిజన్స్ వార్నింగ్

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ( Salman Khan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్‌-3’(Tiger 3).  మనీశ్ వర్మ(Maneesh Sharma) దర్శకత్వం వహించగా..యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. దీపావళి సందర్భంగా థియేటర్లో రిలీజైన టైగర్ 3 కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్సాన్స్ వస్తోంది. అలాగే ఇదే సమయంలో.. సల్మాన్ ఖాన్ తో పాటు అందరు బెదిరిపోయే న్యూస్ కూడా వార్తల్లో నిలుస్తోంది. 

ఫ్యాన్స్ అంటే..తమ హీరోల సినిమాలు రిలీజ్ అయినపుడు పేపర్ కటింగ్స్ తో గాల్లో ఎగరేసి ఎంజాయ్ చేయాలి.. వీలైతే చొక్కాలు చింపుకొని డ్యాన్స్ చేయాలీ. అంతేకానీ, ఇదేంటి అయ్యా..సినిమా చూస్తూ..థియేటర్లో టపాసులు కాల్చడం. ఫ్యామిలీ ఆడియన్స్ ను, ఇంకా ఏదో సరదాగా చూద్దామని వచ్చిన ప్రేక్షకులని ఇబ్బంది పెట్టడం. ఇది ఏమాత్రం బాలేదంటూ థియేటర్స్కు వచ్చిన ప్రేక్షకులు అంటున్నారు. అంతేకాకుండా..హీరో సల్మాన్ కూడా ఇదే విషయంపై తీవ్రంగా స్పందిస్తూ..స్వీట్ వార్నింగ్తో ట్వీట్ చేశారు. 
 
టైగర్ 3 సినిమా చూసే సమయంలో..థియేటర్‌లో బాణాసంచా కాల్చడం గురించి నేను వింటున్నాను. ఇది చాలా ప్రమాదకరం. ప్రేక్షకుల్ని, పిల్లలతో వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ను..రిస్క్‌లో పెట్టకుండా సినిమాను చూసి ఎంజాయ్ చేద్దాం. అందరు సురక్షితంగా ఉండండి..అంటూ సల్మాన్ తెలిపారు. 

ALSO READ :- కాగజ్​నగర్​లో బీఎస్పీ వర్సెస్ ​బీఆర్ఎస్​

టైగర్ 3 విషయానికి వస్తే..గతంలో ఈ ప్రాంచైజీలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలు బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూడో భాగాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. మొదటి రెండు చిత్రాల్లో హీరోయిన్‌‌‌‌గా నటించిన కత్రినా కైఫ్‌ ఇందులోనూ హీరోయిన్‌‌‌‌గా నటించింది.