కాగజ్​నగర్​లో బీఎస్పీ వర్సెస్ ​బీఆర్ఎస్​

కాగజ్​నగర్​లో బీఎస్పీ వర్సెస్ ​బీఆర్ఎస్​
  • బీఎస్పీ వర్సెస్ ​బీఆర్ఎస్​
  • కాగజ్​నగర్​లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై దాడికి కోనప్ప అనుచరుల యత్నం 
  • పలువురిపై కేసు నమోదు

కాగజ్ నగర్ : కొమురం భీం జిల్లా  కాగజ్ నగర్ టౌన్​లో ఉద్రిక్తత వాతారణం చోటుచేసుకుంది. సర్సిల్క్ కాలనీలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, సిర్పూరు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు అడ్డుకున్నారు. ఆర్ఎస్సీపై కోడిగుడ్లు విసిరెందుకు ప్రయత్నించారు. దీంతో బీఎస్పీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. 

అప్రమత్తమైన పోలీసులు అడ్డుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల దాడికి నిరసనగా ప్రవీణ్​కుమార్​కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈఘటనలో బీఎస్పీ, బీఆర్ఎస్ కు చెందిన ఇరువర్గాలకు చెందిన నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ALSO READ :- నాకు ఓటేసినోళ్లకే ఉద్యోగం ఇప్పిస్తా: ఎర్రబెల్లి దయాకర్ రావు