- పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్లాలి:మంత్రి వివేక్
జైపూర్(భీమారం), వెలుగు: కొత్తగా ఎన్నికైన భీమారం సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ సోమాజి గూడలోని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాసంలో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సర్పంచ్‌కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ నాయక్, ఆరేపల్లి సర్పంచ్ వీరయ్య, పార్టీ నాయకులు ఎనమల్ల అశోక్, ఉష్కమల్ల పున్నం చందు, శ్రీనివాస్, కోల కిష్టయ్య, ఆవుల సురేశ్, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.
