- ఆసిఫాబాద్ఎస్పీ నితికా పంత్
కాగ జ్ నగర్/దహెగాం, వెలుగు: లా అండ్ ఆర్డర్ లో ఎక్కడా రాజీ పడొద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ ఆదేశించారు. మంగళవారం కాగజ్ నగర్ డివిజన్లోనిఈస్ గాం, పెంచికల్ పేట్ పోలీస్ స్టేషన్లతోపాటు దహెగాం స్టేషన్‌ను డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి తనిఖీ చేశారు. స్టేషన్ల పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, స్టేషన్ శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు. నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు.
గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రాత్రిపూట పర్యవేక్షణ, పెట్రోలింగ్‌ను కచ్చితంగా కొనసాగించాలని సూచించారు.
