- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ స్పీడప్ చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టర్ ఛాంబర్లో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డిప్యూటీ కలెక్టర్ మహ్మద్ వలియత్ అలీలతో కలిసి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులతో వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై రివ్యూ నిర్వహించారు.
మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా అవకతవకలు లేకుండా స్పష్టంగా రూపొందించాలని ఆదేశించారు. వార్డుల్లో నివాస ప్రాంతాలకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మంచి ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించి ఉండకుండా ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. జనవరి1 నాటికి పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా తయారు చేయాలని ఆదేశించారు.
