నాకు ఓటేసినోళ్లకే ఉద్యోగం ఇప్పిస్తా: ఎర్రబెల్లి దయాకర్ రావు

నాకు ఓటేసినోళ్లకే ఉద్యోగం ఇప్పిస్తా: ఎర్రబెల్లి దయాకర్ రావు

నాకు ఓటేసినోళ్లకే ఉద్యోగం ఇప్పిస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనగామా జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊరూరా ఉద్యోగాలు ఇప్పించానని... ఇప్పడు అలా కాకుండా నాకు ఓట్లేసిన వారికి, బీఆర్ఎస్ కార్యకర్తల పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎర్రబెల్లి అన్నారు. 

ఇప్పుడు తన ప్రచారానికి వచ్చి.. రేపు మరొక చోట వేరే పార్టీ ప్రచారానికి వెళ్లిన వారికి కూడా ఉద్యోగం ఇప్పించనని.. ఎన్నికల  ప్రచారంలో తనతో ఉన్నవాళ్లకే ఉద్యోగం ఇప్పిస్తానని ఆయన వెల్లడించారు.