కేటీఆర్కే సపోర్ట్.. అట్లుంటది మనతోని: డీజే టిల్లు

కేటీఆర్కే సపోర్ట్.. అట్లుంటది మనతోని: డీజే టిల్లు

హైదరాబాద్‌ వేదికగా ఇవాళ ఫార్ములా ఈ–రేస్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ రేస్ ను చూసేందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. డీజే టిల్లు మూవీ హీరో సిద్దూ జొన్నలగడ్డ ఈ రేస్ ను వీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, కేటీఆర్ కు తాను ఎప్పుడు సపోర్ట్ చేస్తానని సిద్ధూ తెలిపారు. ఈ రేస్ తో ఇంటర్నేషనల్ ఫీలింగ్ వస్తుందన్నారు. మీరు ఏ కారు వాడుతున్నారని మీడియా ప్రశ్నించగా...ఈ రేసు లాంటి కారు మాత్రం కాదని బదులిచ్చాడు. కాగా, నెక్లెస్ రోడ్డులో జరిగిన ఫార్ములా ఈ–రేసులో కార్లు దూసుకెళ్లాయి. ఈ రేస్ కు మంత్రి కేటీఆర్‌, హీరోలు రామచ్‌రణ్‌, క్రికెటర్‌లు సచిన్‌, చాహల్‌, పుల్లెల గోపీచంద్‌ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు.