LIC Policy: ఈ పాలసీతో చేతికి కోటి రూపాయలు, రోజూ ఎంత దాచుకోవాలో తెలుసా..?

LIC Policy: ఈ పాలసీతో చేతికి కోటి రూపాయలు, రోజూ ఎంత దాచుకోవాలో తెలుసా..?

LIC Jeevan Labh: ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ ఎల్ఐసీ అనేక దశాబ్ధాలుగా దేశంలోని ప్రజల ఆర్థిక భద్రత కోసం అనేక పాలసీలను తీసుకొస్తూనే ఉంది. వీటి ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరచటం, వారికి మెరుగైన సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను అందించటం, పాలసీదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించటం లక్ష్యంగా వివిధ పాలసీలను రూపొందిస్తూనే ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ఎన్ని కంపెనీలు అరంగేట్రం చేసినప్పటికీ ఎల్ఐసీ సింహభాగంతో ముందుకు సాగుతూనే ఉంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎల్ఐసీ జీవన్ లాభ్ సేవింగ్స్ ప్లాన్ పాలసీ గురించే. మెచూరిటీ సమయంలో ఒకేసారి పెద్ద మెుత్తాన్ని పాలసీదారుని చేతికి ఇది అందిస్తుంది. ఒక వేళ సదరు వ్యక్తి పాలసీ కాలం కంటే ముందే మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాను అందిస్తుంది. ఈ పాలసీ ద్వారా భారీ కార్పస్ అంటే రూ.60 లక్షలు అందుకోవాలని ప్లాన్ చేస్తున్న వ్యక్తుల కోసం ఎలా పెట్టుబడి పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

ఎవరైనా వ్యక్తి తనకు పాతికేళ్ల వయస్సు ఉన్న సమయంలో జీవన్ లాభ్ పాలసీ కింద 25 ఏళ్ల కాలానికి పెట్టుబడి పెట్టినట్లయితే వారు చివర్లో ఏకంగా రూ.60 లక్షల కంటే ఎక్కువ మెుత్తాన్ని తిరిగి చేసికి పొందుతారు. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి సదరు వ్యక్తి ప్రతి నెల రూ.8893 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి రోజు కేవలం రూ.296 పెట్టుబడి కోసం కేటాయించటం ద్వారా భారీ మెుత్తాన్ని అందుకోవచ్చు. భారీ కార్పస్ మెుత్తాన్ని పొందటం కోసం ఏటా రూ.లక్ష 4వేల 497 వెచ్చించాల్సి ఉంటుందని వెల్లడైంది. 

కోటి రూపాయలు కావాలంటే ఎలా..?
అయితే ఎల్ఐసీ అందిస్తున్న జీవన్ లాభ్ పాలసీలో మీరు చేసే రోజువారీ పెట్టుబడి మెుత్తాన్ని కొంత పెంచటం ద్వారా కోటి రూపాలయల కంటే ఎక్కువ మెుత్తాన్ని మెచూరిటీ సమయంలో తిరిగి పొందవచ్చు తెలుసా. దీనికోసం పాలసీదారు 25 ఏళ్ల వయస్సులో పెట్టుబడిని మెుదలుపెట్టి 25 ఏళ్ల పాటు ప్రతి రోజూ రూ.512 చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. అలా చివరికి మెచూరిటీ సమయంలో ఏకంగా రూ.కోటి 9 లక్షలను రాబడిగా అందుకోవచ్చు.

పాలసీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీక సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని లేదా వారి అధికారిక కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేయటం ద్వారా పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించవచ్చు. అయితే పాలసీ కొనుగోలు చేసే వ్యక్తులు ఏజెంట్లు చెప్పే మాటలకు పడిపోకుండా పాలసీ ప్రయోజనాలు, దానికి ఉండే చట్టపరమైన నిబంధనల గురించి తెలుసుకుని ముందుకు వెళ్లటం మంచిది.