మున్సి పల్ చైర్మన్ , మేయర్ పదవులలో బీసీలకు 50 శాతం ఇవ్వాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్

మున్సి పల్ చైర్మన్ , మేయర్ పదవులలో  బీసీలకు 50 శాతం ఇవ్వాలి :  ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్
  •     ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: మున్సిపల్ చైర్మన్ , మేయర్ పదవులలో బీసీలకు 50 శాతం కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం చేశారని.. అయినప్పటికీ, జనరల్ స్థానాలలో బీసీలు నిల్చొని గెలుపొందారని తెలిపారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. కోర్టులో కేసు ఉందని గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేశారని... ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా అదే తరహాలో నిర్వహించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం ఢిల్లీకి 64 సార్లు వెళ్లినా.. బీసీల డిమాండ్లపై  ప్రధాని వద్ద చర్చించలేదని మండిపడ్డారు.