
రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామా జానర్లో తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే పెద్ది నుంచి రిలీజైన గ్లింప్స్లో రామ్ చరణ్ లుక్, విజువల్స్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. లేటెస్ట్గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు.
ఈ సాంగ్ కోసం రక రకాల హీరోయిన్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదట కాజల్ అగర్వాల్ను అనుకున్నారనే టాక్ వచ్చింది. ఆ తర్వాత పుష్ప సినిమాల్లో కిసిక్స్ పాటతో అందరినీ అలరించిన ఎనర్జిటిక్ భామ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఆమె దాదాపుగా ఖాయమైందనే వాదన కూడా బలంగా వినిపించింది.
కానీ, ఇప్పుడు లేటెస్ట్గా బుట్టబొమ్మ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూజా హెగ్దేతో ఈ పాట చేయిద్దామనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. గతంలో జిగేల్ రాణి ఐటెం సాంగ్ లో కూడా పూజా హెగ్దే నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ సెంటిమెంట్ను పెద్ది సినిమాను కోసం వాడుకోవాలని చూస్తున్నారట బుచ్చిబాబు. త్వరలో పెద్ది ఐటెం భామపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ (AR Rahaman)సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. 27 మార్చి 2026న థియేటర్లలో విడుదల కానుంది.