
హైటెక్ యుగం.... కంప్యూటర్ యుగంలో జనాలకు ఏ మాత్రం ఖాళీ లేకుండా బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఆకలైనప్పుడు..దగ్గర్లో ఉన్న బేకరీకి వెళ్లి... బర్గరో.. పీజానో.. లేదా అక్కడ అందుబాటులో ఉన్నజంక్ ఫుడ్ తిని ఆకలి చంపుకుంటున్నారు. ఇక అంతే రెండు మూడు నెలలకు అమాంతంగా బరువు పెరగడం.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటారు. ఇలా అధిక బరువుతో బాధపడే వారు వంటింటి పోపుల పెట్టెలో ఉండే జిలకర్రను నీటిలో కలుపుకొని తాగితే ఇట్టే బరువు తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
పొద్దున్నే నిద్ర లేవడంతోనే జనాలు కాఫీ.. టీ .. బూస్ట్.. ఇలా ఎవరికి నచ్చింది వారు తాగుతారు. ఇక అంతే కొంత కాలానికి బరువు పెరగడం అనేక సమస్యలను ఎదర్కొంటున్నారు. ఇలా బాధ పడే వారు రోజు పొద్దున్నే పరగడడపున జిలకర్ర నీళ్లను తాగడం వలన బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది బరువును తగ్గించడమే కాదు.. ఇతర రకాల వ్యాధుల బారి నుంచి విముక్తి కలుగుతుందంటున్నారు.
జీలకర్రలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ .. యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. జీలకర్ర రోగనిరోధక శక్తిని వృద్ది చేస్తుంది. జీలకర్ర నీరు తాగడం వల్ల గ్యాస్టిక్ ట్రబుల్.. ఊబకాయం.. ఉబ్బరం.. కడుపునొప్పి లాంటి సమస్యలను తగ్గించడం.. జీర్ణక్రియను మెరుగుపరచడం లాంటి సమస్యల బారి నుంచి కాపాడుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
ఇక డయాబెటిస్ తో బాధపడే వారు రోజు ఉదయం.. పాలతో తయారు చేసిన టీ.. కాఫీకి బదులుగా జిలకర్ర టీ తాగితే..ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మధుమేహంతో పాటు రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం నుంచి కాపాడుతుంది. మహిళలు హార్మోన్ల సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమంది పిరియడ్స్ టైం ప్రకారం రాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇంకా రుతుస్రావం సమయంలో కడుపునొప్పి వేధిస్తుంది. రోజూ పొద్దున్నే జిలకర్ర నీళ్లను తాగితే ఇలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.
ఎలా తయారు చేయాలి
ఒక గ్లాసు నీటిలో... ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం, జీలకర్రతో పాటు నీటిని ఒక పాన్‌లో వేసి గోరు వెచ్చగా మరిగించండి. ఆ నీటిని టీ తాగిన విధంగా తాగండి. ఇందులో టేస్ట్ కోసం కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలుపుకొని తాగండి