సింగరేణిలో మూతపడనున్న గనులు ఇవే.. ఉద్యోగులు, కార్మికుల సంఖ్య 35 వేలకు పడిపోయే ప్రమాదం !

సింగరేణిలో మూతపడనున్న గనులు ఇవే.. ఉద్యోగులు, కార్మికుల సంఖ్య 35 వేలకు పడిపోయే ప్రమాదం !

135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి 1920 డిసెంబర్ 23న ‘సింగరేణి లిమిటెడ్ కంపెనీ’గా మారింది. ప్రస్తుతం రాష్ట్రం 51 శాతం, కేంద్రం 49 శాతం వాటాలతో పబ్లిక్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ కంపెనీగా ఉంది. 1990 దశకంలో రెండుసార్లు బీఐఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి ఒక్కటే.

1998 నుంచి సంస్థ లాభాల్లోకి వచ్చింది. 2001-–02 నుంచి కార్మికులకు లాభాల్లో బోనస్​చెల్లిస్తోంది. ప్రస్తుతం 42 అండర్​గ్రౌండ్, ఓపెన్​కాస్టు ప్రాజెక్టుల ద్వారా ఏటా 72 మిలియన్​టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా.. దీన్ని 100 మిలియన్​టన్నులకు పెంచాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది.

కానీ గత11 ఏండ్లలో ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ మినహా కొత్త గనులేవీ ప్రారంభించలేదు. దీనికితోడు కాలం చెల్లిన పాత గనులను ఒక్కొక్కటిగా మూసివేస్తుండడం, కొత్త గనులు లేకపోవడంతో సింగరేణి మనుగడపై ఆందోళన వ్యక్తమవుతున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే 2042–-‌‌‌‌‌‌‌‌43 నాటికి బొగ్గు బావులు19కి, ఉత్పత్తి 39 మిలియన్​టన్నులకు పడిపోనుంది. కొత్త గనులు లేకపోవడంతో సింగరేణిలో రిక్రూట్‌‌‌‌మెంట్లు కూడా ఆగిపోయాయి.

వాస్తవానికి 1991లో సింగరేణి వ్యాప్తంగా లక్షా16వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఉండగా.. తెలంగాణ వచ్చే(2014) నాటికి ఈ సంఖ్య 61,778కి పడిపోయింది. అండర్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ మైన్స్​తగ్గడం, ఓసీపీలు, యాంత్రికీకరణ పెరగడం వల్లే ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం సంస్థలో 41 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఈ సంఖ్య 35 వేలకు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. సింగరేణిలో మూతపడనున్న గనులు కలవరపాటుకు గురిచేస్తు్న్నాయి.

మూతపడనున్న గనులు..
*2024-25లో జేకే-5ఓసీ, ఆర్జీ ఓసీ-1, ఎస్ఆర్పీ-1యూజీ, ఆర్కేపీ ఓసీపీ(ఫేజ్-1), 6ఏ యూజీమైన్, ఆర్కే-5, ఆర్కే-6, ఆర్కే-న్యూటెక్ యూజీ గనులు మూతపడనున్నాయి. దీంతో సుమారు 2.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గనుంది.    
* 2025-26లో భూపాలపల్లి ఏరియాలోని కేటికే-6 యూజీ మైన్ మూతపడనుంది. దీంతో సుమారు 0.30 మిలియన్ టన్నుల ఉత్పత్తి పడిపోతుంది. 
* 2027-28లో కిష్టారం ఓసీపీ, పీకే ఓసీ, కోయగూడెం-2, ఆర్జీఓసీపీ-3 ఎక్స్టెన్షన్, ఖైరీగూరా, జీడీకే11, వీకేపీ, కేకే5, ఆర్కే7, ఇందారం1ఏ గనులు మూతపడనున్నాయి. వీటిని మూసివేస్తే సుమారు 28 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గుతుంది.
* 2032-33లో జీడీకే-5 ఓసీపీ, కేటీకేఓసీ-2, కేకే ఓసీపీ, జేకే ఓసీపీ, పీవీకే5, కేటీకే-8యూజీ, కాసీపేట యూజీ మైన్లు మూతపడనున్నాయి. దీంతో సుమారు 7.58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పడిపోతుంది.    
* 2037-38లో రామగుండంఓసీపీ-3, ఎస్సార్సీ ఓసీపీ-2, గోలేటీ ఓసీపీ, ఎస్సార్పీ3,3ఏ యూజీమైన్ మూతపడనున్నాయి. వీటి వల్ల సింగరేణి 10.78మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి  కోల్పోతుంది.     
* 2042-43లో మణుగూరు ఓసీపీ, ఇందారం ఓసీపీ, రామకృష్ణాపూర్ ఓసీపీ-2ఫేజ్, ఎంవీకే ఓసీపీ, ఆర్కే-5, ఆర్కే-6 ఓసీపీ, కేటీకే1అండ్1ఏ యూజీ గనులు బంద్​కానున్నాయి. వీటి ద్వారా సుమారు 8.94మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది.