- రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం
రాయికల్, వెలుగు : సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన వ్యక్తి చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... రాయికల్ పట్టణం భీమన్నవాడకు చెందిన సుతారి ధర్మయ్య (48) 15 ఏండ్లుగా సౌదీలో ఉంటున్నాడు. జిద్దాలో రోడ్డు దాటుతున్న సమయంలో ఓ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు బుధవారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ధర్మయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
