కోనరావుపేట/కరీంనగర్ సిటీ/మల్లాపూర్, వెలుగు: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన లీడర్లు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు కోనరావుపేట ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, సింగిల్ విండో చైర్మన్ బండ నరసయ్య, లీడర్లు గంగాధర్, ప్రభాకర్, పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ లీడర్లు శ్రీనివాస్ రెడ్డి, జలపతిరెడ్డి, బాపురెడ్డి, రాజన్న, శేషి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 97 వ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఆయనతోపాఉట లీడర్లు కొట్టె ప్రభాకర్, కీర్తి కుమార్, ఉప్పరి అజయ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రచారం చేశారు.
