మ్యూచువల్ ఫండ్స్ చాలా మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బు సేకరించి.. ప్రొఫెషనల్ మేనేజర్ ద్వారా వివిధ స్టాక్స్, బాండ్స్, ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. ఇది ఇన్వెస్టర్లకు పెట్టుబడి డైవర్సిఫికేషన్, లిక్విడిటీ, తక్కువ ఖర్చుతో పెట్టుబడికి అవకాశం ఇస్తుంది. గడచిన కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై ప్రజలు ఎక్కువగా ఫోకస్ చేయటంతో కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి. దీంతో ప్రతి నెల కొత్త ఫండ్స్ లాంచ్ కొనసాగుతోంది.
మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ కనీస మెుత్తం తగ్గించటంతో చాలా మంది.. పదుల సంఖ్యలో ఫండ్స్ ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు తప్పు జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకే రకమైన లేదా కేటగిరీ ఫండ్స్ వేరువేరు అసెట్ మేజేన్మెంట్ కంపెనీల నుంచి కొంటున్నారు అధిక రిటర్న్స్ మాయలో పడి కొత్తగా వస్తున్నా పెట్టుబడిదారులు. ఒకే థీమ్ ఉన్న ఫండ్స్ ఒకే రకమైన కంపెనీలను ఎంచుకుంటాయనే కామన్ సెన్స్ మిస్ అవుతున్నారు చాలా మంది.
దీంతో వేరువేరు ఫండ్లలో స్టాక్స్ డూప్లికేట్ అవ్వటంతో గందరగోళంతో పాటు ఖర్చులు పెరుగుతున్నాయని గుర్తించటం లేదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇలా మల్టిపుల్ ఫండ్లలో సేమ్ స్టాక్స్ ఉండటం వల్ల కొన్ని కంపెనీలకు ఎక్కువ ఎక్స్‌పోజర్, రిస్క్ పెరుగుతోందని వారికి అర్థం కావటం లేదు. అందువల్ల సాధారణంగా 13-14 మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫోలియోలో ఉంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
అందుకే యువ పెట్టుబడిదారులు చిన్న మొత్తాలతో మొదలు పెట్టి.. కొంతకాలం తర్వాత SIP ద్వారా పరిమితంగా ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో వారు పెట్టుబడులు పెడుతున్న స్కీమ్స్, వాటి ఖర్చులు, ఫండ్ పెట్టుబడుల తీరు, ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీలు వంటి ప్రాథమిక వివరాలను గమనించి తర్వాత ఎంచుకునే ఫండ్స్ విషయంలో జాగ్రత్తలు పాటించటం స్టాక్ డూప్లికేషన్ తగ్గిస్తుందని వారు చెబుతున్నారు. తక్కువ కాల పెట్టుబడులకు డెట్ లేదా లిక్విడ్ ఫండ్స్, మధ్యకాలపరిమితి కోసం హైబ్రిడ్ ఫండ్స్, దీర్ఘకాలపరిమితి కోసం ఈక్విటీ ఫండ్స్ సూచిస్తున్నారు. అలాగే పోర్ట్‌ఫోలియోలో స్టాక్ ఓవర్‌లాప్ 40-50 శాతం కంటే ఎక్కువ అయితే అది రిస్క్ తగ్గించడం కాకుండా పెంపొందిస్తుందని గమనించాలని హెచ్చరిస్తున్నారు.
