భారత్‎తో పెట్టుకుంటే ఇట్లే ఉంటది మరీ: టర్కీకి మరో షాక్ ఇచ్చిన మోడీ సర్కార్

భారత్‎తో పెట్టుకుంటే ఇట్లే ఉంటది మరీ: టర్కీకి మరో షాక్ ఇచ్చిన మోడీ సర్కార్

న్యూఢిల్లీ: భారత్‎తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో టర్కీకి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. భారత్, పాక్ ఉద్రిక్తల వేళ టర్కీ ఏకపక్షంగా పాక్‎కు మద్దతుగా నిలిచింది. ఇక్కడితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి.. పాక్‎లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులను సైతం తప్పుబట్టింది. ఇదే కాకుండా భారత్‎పై దాడులు చేసేందుకు పాకిస్థాన్‎కు ఆయుధాలు సరఫరా చేసింది. భారత చిరకాల శత్రువు పాక్‎కు అండగా నిలవడంతో టర్కీపై భారతీయులు భగ్గుమంటున్నారు. 

గతంలో టర్కీ భారీ భూకంపానికి గురైన సమయంలో భారత్ చేసిన సహయాన్ని మరిచి ఆ దేశం పాకిస్తాన్‎కు వత్తాసు పలుకుతోందని.. ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాలని బాయ్ కాట్ టర్కీ అని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు ఇండియన్స్. బాయ్ కాట్ టర్కీలో భాగంగా ఆ దేశం నుంచి వచ్చే యాపిల్స్, ఇతర ఎగుమతులను బ్యాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా టర్కీకి భారత ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది. టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని రద్దు చేసింది. 

ఈ మేరకు గురువారం (మే 15) బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇస్తాంబుల్‌కు చెందిన సెలెబి ఏవియేషన్ హోల్డింగ్ అనుబంధ సంస్థ అయిన సెలెబి.. ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, కన్నూర్, బెంగళూరు, హైదరాబాద్, గోవా, అహ్మదాబాద్, చెన్నైతో సహా తొమ్మిది ప్రధాన భారతీయ విమానాశ్రయాలలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. భారత్, పాక్ ఇష్యూలో టర్కీ ఏకపక్ష తీరుతో ఆ దేశంతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 

ఈ నేపథ్యంలో టర్కీష్‏కు చెందిన సెలెబి కంపెనీపై ఇండియా చర్యలు తీసుకుంది. గ్రౌండ్ సపోర్ట్ కోసం సెలెబి కంపెనీపై ఆధారపడే అనేక దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల సేవలకు ప్రభుత్వ నిర్ణయం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇటీవలి భారత్, పాక్ మధ్య జరిగిన సైనిక దాడుల తర్వాత పాకిస్తాన్‌కు టర్కీయే మద్దతు ఇస్తున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా BCAS ఈ ఆదేశాలు జారీ చేసినట్లు  ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.