
హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువ నిలుస్తున్నారు. అందుకు కారణం సమంత పెట్టె పోస్టులే. ఇటీవలే సమంత నిర్మాతగా శుభం మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ టైం నుంచి సక్సెస్ సెలబ్రేషన్ వరకు వరుస పోస్టులు పెడుతూ వస్తోంది.
ఈ క్రమంలో ప్రతి పోస్టులో డైరెక్టర్ రాజ్తో చనువుగా ఫొటోలకు ఫోజులిస్తూ వస్తుంది. దాంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వినిపిస్తున్న రూమర్స్ నిజమనేలా ప్రవర్తిస్తున్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి (Shhyamali)పెట్టిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఒక ప్రశాంతమైన సందేశాన్ని నెటిజన్లతో పంచుకుంది. ‘‘నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసే వారందరికీ ప్రేమ, ఆశీస్సులు పంపుతున్నా’’ అనే పోస్ట్‌ను శ్యామాలి షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతకాలంగా తన సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు చేయని శ్యామలీ సడెన్గా ఇటువంటి మెసేజ్ ఇచ్చే పోస్ట్ చేయడంతో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అసలు శ్యామలీ ఎందుకు ఇలాంటి పోస్ట్ షేర్ చేసిందా అని మాట్లాడుకుంటున్నారు.
శ్యామాలి విషయానికి వస్తే.. సైకాలజీలో గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా మరియు విశాల్ భరద్వాజ్ ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె స్క్రిప్ట్ రైటర్ కూడా రాణించింది. రంగ్ దే బసంతి, ఓంకార, మరియు ఏక్ నోదిర్ గోల్పో వంటి చిత్రాలకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వర్క్ చేసి పేరు తెచ్చుకుంది. 2015లో డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమ వివాహం చేసుకోగా.. వీరికి ఒక పాప ఉంది.
Also Read : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు
అయితే, బుధవారం మే14న సమంత బుధవారం సమంత రూత్ ప్రభు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వరుస ఫోటోలను షేర్ చేసిన వెంటనే శ్యామలి పోస్ట్ వచ్చింది. శుభం సక్సెస్ పార్టీ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో పలు ఫోటోలు పంచుకుంది. మొదటి ఫోటోలో సమంత రాజ్‌కు దగ్గరగా నిలబడి శుభం పోస్టర్‌ను చూపించింది. మరొక ఫోటోలో శుభంలో తన పాత్రగా చూపించగా, ఆమె రాజ్‌తో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఇంకోక ఫొటోలో ఏకంగా సమంత, రాజ్ కలిసి విమానంలో కూర్చుని, రాజ్ భుజాలపై తల ఆనించి కూర్చుంది. ఈ ఫోటోలకు నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, గతకొన్నాళ్లుగా సమంత మరియు రాజ్ నిడిమోరు డేటింగ్ చేస్తున్నారని పుకారు ఉంది. కానీ, ఈ ఊహాగానాలపై వారిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అంతకుముందు, సమంత మరియు రాజ్ కొంతమంది స్నేహితులతో కలిసి తిరుమల సందర్శించడం కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇకపోతే, సమంత, రాజ్ కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల కోసం పనిచేశారు. ఆమె ఇప్పుడు అతనితో 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్'లో పనిచేస్తున్నారు. అంతేకాదు.. వీరిద్దరూ చెన్నై సూపర్ ఛాంప్స్ అనే పికిల్‌బాల్ జట్టుకు కూడా భాగస్వాములు. మరి వీరిద్దరి మధ్య వచ్చే రూమర్స్కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందనేది తెలియాల్సి ఉంది.