Bellamkonda Sai Srinivas: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు.. రీజన్ ఇదే

Bellamkonda Sai Srinivas: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు.. రీజన్ ఇదే

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కేసు నమోదైంది. రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా, ట్రాఫిక్ పోలీసుపై దురుసుగా ప్రవర్తించినందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే, జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న సాయి శ్రీనివాస్.. ఇంటికెళ్లే క్రమంలో తాగి కారు నడిపినట్లు ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించే అవకాశం కనిపిస్తోంది. మరి హీరో బెల్లంకొండ సాయి ఎలాంటి సమాధానం చెప్పనున్నాడో తెలియాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. 

మంగళవారం (మే13) సాయంత్రం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో రాంగ్ రూట్లో కారు నడిపాడు. అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కారుతో డ్యాష్ ఇవ్వబోయాడు. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ క్షణికంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్లో ఫేమస్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడే ఈ బెల్లంకొండ సాయి శ్రీనివాస్.