
Gold Price Today: చాలా రోజుల నిరంతర పెరుగుదల తర్వాత బంగారం ధరలు ప్రస్తుతం క్రమంగా దిగివస్తున్నాయి. ప్రధానంగా అమెరికా ఒక్కో దేశంతో వరుసగా వ్యాపార డీల్స్ చేసుకోవటం ఆందోళనలను తగ్గిస్తోంది. ట్రంప్ టారిఫ్స్ భయాలు మెల్లగా తొలగటంతో అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లలో కోలాహలం కొనసాగుతోంది. పైగా ఇటీవల భారీగా పెరిగిన ధరలతో ప్రజలు సైతం కొనుగోళ్లకు దూరంగా ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.19వేల 500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 610, ముంబైలో రూ.8వేల 610, దిల్లీలో రూ.8వేల 625, కలకత్తాలో రూ.8వేల 610, బెంగళూరులో రూ.8వేల 610, కేరళలో రూ.8వేల 610, పూణేలో రూ.8వేల 610, వడోదరలో రూ.8వేల 615, జైపూరులో రూ.8వేల 625, లక్నోలో రూ.8వేల 625, నాశిక్ లో రూ.8వేల 613, మంగళూరులో రూ.8వేల 610, అయోధ్యలో రూ.8వేల 625, నోయిడాలో రూ.8వేల 625, బళ్లారిలో రూ.8వేల 610, గురుగ్రాములో రూ.8వేల 625 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.21వేల 300 పడిపోయాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిగణిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 393, ముంబైలో రూ.9వేల 393, దిల్లీలో రూ.9వేల 408, కలకత్తాలో రూ.9వేల 393, బెంగళూరులో రూ.9వేల 393, కేరళలో రూ.9వేల 393, పూణేలో రూ.9వేల 393, వడోదరలో రూ.9వేల 398, జైపూరులో రూ.9వేల 408, లక్నోలో రూ.9వేల 408, నాశిక్ లో రూ.9వేల 396, మంగళూరులో రూ.9వేల 393, అయోధ్యలో రూ.9వేల 408, నోయిడాలో రూ.9వేల 408, బళ్లారిలో రూ.9వేల 393, గురుగ్రాములో రూ.9వేల 408గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 610 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల393గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 8వేల వద్ద కొనసాగుతోంది.