హైదరాబాద్ లో యువత రాను రానూ దిగజారిపోతున్నారు. కొంతమంది డ్రగ్స్ కి బానిసలయ్యి జీవితాలు నాశనం చేసుకుంటుంటే.. ఇది చాలదన్నట్టు గ్రైండర్ లాంటి డేటింగ్ యాప్స్ యువతను మరింత దిగజారిపోయేలా చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ లో ద్వారా యువత అకృత్యాల గురించి తరచూ వార్తలొస్తున్నాయి. ఇప్పుడు గ్రైండర్ యాప్ లో మరో బాగోతం బయటపడింది. గ్రైండర్ యాప్ లో ట్రాన్స్ జెండర్ ను బుక్ చేసుకున్న ముగ్గురు యువకులు అమానుషానికి పాల్పడ్డారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
హైదరాబద్ లోని హబీబ్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులు గ్రైండర్ అనే ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా ఓ ట్రాన్స్ జెండర్ ను బుక్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం ట్రాన్స్ జెండర్ ను తాము అనుకున్న ప్లేస్ కి రప్పించిన యువకులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తమకు 30 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు యువకులు. డబ్బులు ఇవ్వడానికి ట్రాన్స్ జెండర్ నిరాకరించడంతో ఆమెపై దాడికి దిగారు యువకులు.
నిందితుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఎంఐఎం పార్టీకి చెందిన నేత కుమారుడు కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
