ఆన్ లైన్ గేమిగ్ యాప్స్ ప్రమోషన్ కేసు విచారణలో భాగంగా నటుడు దగ్గుబాటి రానా స్టేట్ మెంట్ రికార్డు చేశారు సీఐడీ అధికారులు. 2025 నవంబర్ 15వ తేదీన హైదరాబాద్ లోని లకిడీకాపూల్ సీఐడీ ఆఫీసులో గంటన్నర పాటు జరిగిన విచారణలో.. స్టేట్ మెంట్ నమోదు చేశారు అధికారు.
తను ప్రమోట్ చేసిన యాప్ గురించి తన లీగల్ టీమ్ వెరిఫై చేసిందని చెప్పారు. యాప్ చట్టబద్ధమైనదని తెలుసుకున్న తర్వాతే ప్రమోట్ చేసినట్లు చెప్పారు రానా. విచారణకు బ్యాంక్ స్టేట్ మెంట్స్ తో వెళ్లాలనని.. పూర్తి లావాదేవిలకు సంబంధించిన స్టేట్ మెంట్ అధికారులకు ఇచ్చినట్లు విచారణ అనంతరం తెలిపారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించినట్లు ఈ సందర్భంగా చెప్పారు.
బెట్టింగ్ యాప్‌తో చేసుకున్న అగ్రిమెంట్‌పై సీఐడీ విచారించినట్లు తెలుస్తోంది. యాప్ ప్రమోషన్‌తో వచ్చిన పారితోషికంపై ప్రశ్నించింది. 2017లో బెట్టింగ్, గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన రానా.. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని ఈ సందర్భంగా చెప్పారు.
ఆర్థిక లావాదేవీల చిట్టాపై దృష్టి:
ప్రస్తుతం సిట్ అధికారులు దృష్టి అంతా ఆర్థిక లావాదేవీల చిట్టాపైనే ఉంది. ఈ ప్రమోషన్ల కోసం వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఖాతాల్లో జమ అయింది, హవాలా మార్గాల ద్వారా ఏమైనా చెల్లింపులు జరిగాయా అనే అంశాలపై నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రముఖులు కేవలం ప్రచార కర్తలుగానే ఉన్నారా, లేక వారికి అంతకుమించి ఏమైనా పాత్ర ఉందా అనే కీలక కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లను విచారించిన విషయం తెలిసిందే. లేటెస్టుగా రానాతో పాటు విష్ణు ప్రియ నుంచి కూడా స్టేట్ మెంట్ నమోదు చేశారు సీఐడీ అధికారులు.
