ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘90స్’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ రూపొందిస్తున్న చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌గా ‘సంచారమే’ అనే పాటను విడుదల చేశారు. ప్రజాకవి గోరటి వెంకన్న ఈ పాటను రాయడం విశేషం.
‘‘సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందం ఏమున్నది.. ఊరునిడిశి గాలి మోటరెక్కినాది.. మోటు మడుషుల నిడిశి.. స్వీటు మడుషుల చేరి మనసునమ్ముకుంది.. వెంకటేశ్వరస్వామి నడిమిట్ల కలిసేనా ప్రేమల సుకుమారి..” అంటూ ఆయన రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేయడంతో పాటు గోరటి వెంకన్నతో కలిసి పాడాడు. తరుణ్ సైదులు అడిషనల్ లిరిక్స్ అందించాడు. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య గల తేడాను ప్రతిబింబిస్తూ సాగిన ఈ పాటను లండన్ బ్యాక్‌డ్రాప్‌లో ఆనంద్, వైష్ణవి జంట మధ్య చిత్రీకరించారు. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
