
ఇటీవల కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kichha sudeep) పై కొందరు నిర్మాతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. తమతో సినిమాలు చేస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకొని.. సినిమాలు చేయడం లేదని ఆరోపించారు. కోటిగొబ్బ -3(Kotigobba3), విక్రాంత్ రోనా(Vikranth Rona) సినిమాల తరువాత తమ సినిమా ప్రారంభిస్తానని చెప్పి ఇప్పటవరకు స్పందించలేదని తెలిపారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే ధర్నాకు దిగుతామని నిర్మాత ఎంఎన్ కుమార్ తలిపారు. హీరో సుదీప్ పై వచ్చిన ఈ విమర్శలు కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే గత రెండు రోజులుగా తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు హీరో సుదీప్. తమతో సినిమా చేస్తానని నిర్మాతలు చేసిన విమర్శల్లో ఎలాంటి నిజం లేదని, తప్పుడు ఆరోపణులు చేసినందుకు గాను వారిఫై రూ.10 కోట్లకు పరువు నష్టం కేస్ నమోదు చేశారు. అంతేకాకుండా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు సుదీప్.