ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంపై సీనియర్ హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు సుమన్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి తీరుపినిచ్చారని, మంచి కాంబినేషన్లో కొత్త ట్విస్ట్ ఇచ్చారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అవకాశం రావడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని సీట్లలో క్లీన్ స్వీప్ చేయడం జరిగిందని, ప్రజలు వచ్చే ఐదేళ్ల అభివృద్ధికి పునాదులు వేశారని అన్నారు.
విద్యా, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని, అమెరికా లాంటి కాపిటల్ ఏపీకి రావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. హైదరాబాద్ లాంటి నగరం ప్రపంచ స్థాయికి ఎదగటానికి చంద్రబాబే కారణమని అన్నారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. అమరావతి కాస్మోపాలిటన్ సిటీగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతిని టెంపుల్ సిటీగా ప్రకటించాలని, తిరుపతి, ఈస్ట్ - వెస్ట్ గోదావరిలో ఫిలిం సిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. సుమన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.