డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆకట్టుకునే సూర్య.. తాజాగా ‘కంగువా’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూర్య కెరీర్‌లో ఇది 42వ చిత్రం. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీడియోల్ కీ రోల్ చేస్తున్నాడు.
ఇప్పటికే విడుదల చేసిన సూర్య లుక్, వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అక్టోబర్‌లో రజినీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య తమిళనాట పోటీ వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు సూర్య నటించనున్న ‘కర్ణ’ చిత్రం ఆగిపోయిందనే న్యూస్ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ రూపొందించనున్న ఈ చిత్రంలో కర్ణుడిగా సూర్య నటించనున్నట్టు దాదాపు ఫిక్స్ అయింది. కానీ రీసెంట్‌గా వచ్చిన ‘కల్కి’లో ప్రభాస్ కర్ణుడిగా కనబడటంతో ఈ ప్రాజెక్టుపై సూర్య ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
