పాన్ ఇండియా మూవీని ప్రారంభించిన ఉపేంద్ర

పాన్ ఇండియా మూవీని ప్రారంభించిన ఉపేంద్ర

హీరో ఉపేంద్ర అంటేనే విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు. ఆయన సినిమా అంటేనే చాలు..సమ్ థింగ్ ఈజ్ డిఫ్రెంట్ అనుకుంటారు ప్రేక్షకులు.  విలక్షణ నటుడిగా అభిమానుల మనసుల్లో ముద్ర వేసుకున్న ఉపేంద్ర..దర్శకుడిగానూ సత్తా చాటాడు. ఓంకారం,A,ఉపేంద్ర, సూపర్' వంటి చిత్రాలకు దర్శకత్వం చేసి..గుర్తింపు పొందాడు. చివరగా ఉపేంద్ర-2 మూవీని తెరకెక్కించిన ఆయన..ఏడేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి డైరెక్షన్ చేయబోతున్నాడు. UI అనే డిఫరెంట్ టైటిల్తో భారీ చిత్రానికి ఉపేంద్ర శ్రీకారం చుట్టారు. 

యూఐ చిత్రం ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది.  ఈ కార్యక్రమంలో  కన్నడ స్టార్స్ శివ రాజ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  కిచ్చా సుదీప్ - విజయ్ - ధనుంజయ హాజరయ్యారు. కిచ్చా సుధీప్ క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. 

UI మూవీకి ఉపేంద్ర కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నారు. వీనస్ ఎంటర్టైన్మెంట్స్, లహరి మ్యూజిక్ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.  ఈ మూవీకి నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 

గతంలో 'A''రా' అంటూ ఒక అక్షరాన్నే టైటిల్గా పెట్టిన అభిమానులను అలరించారు ఉపేంద్ర. అంతేకాదు అసలు టైటిలే లేకుండా కేవలం సింబల్ను వాడి  మూవీ తీసిన ఘనత ఉపేంద్రది. ఇప్పుడేమో 'UI' అంటూ రెండు ఇంగ్లీష్ అక్షరాలనే టైటిల్గా అనౌన్స్ చేశారు. మరోవైపు ఉపేంద్ర 'గని' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.  ప్రస్తుతం 'త్రిశూలం' 'బుద్దివంత 2' 'బొజ్జా', రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ మల్టీ లాంగ్వేజ్ సినిమా చేస్తున్నారు.