
హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ రిలీజ్కు సిద్ధమైంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా (జులై31న) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కింగ్‌డమ్ చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇవాళ ఆదివారం ఉదయం (జులై27న) వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ, కింగ్‌డమ్ ప్రొడ్యూసర్ నాగవంశీ స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కింగ్‌డమ్ భారీ విజయం సాధించాలని శ్రీవారిని పండితులు కోరారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే.. శనివారం (జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో కింగ్‌డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కింగ్‌డమ్ ట్రైలర్ లాంచ్‌లో హీరో విజయ్ పక్కా రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడి ఆకట్టుకున్నారు.
#VijayDeverakonda and #BhagyashriBorse visits Lord Venkateswara Swamy in Tirumala and seeks blessings#Kingdom pic.twitter.com/rLClMTwbPp
— Ramesh Pammy (@rameshpammy) July 27, 2025
‘‘ఆ వెంకన్న సామి దయ.. మీ అందరి ఆశీస్సులు. ఈ రెండు నాతో పాటు ఉంటే, ఎవరూ మనల్ని ఆపలేరు. నాలుగు రోజుల్లో మిమ్మల్ని అందరినీ థియేటర్స్‌లో కలుస్తా’’ అని విజయ్ దేవరకొండ తిరుపతి ఫ్యాన్స్లో కొత్త జోష్ని నింపారు. ‘కింగ్‌డమ్’.. ట్రైలర్ ఆకట్టుకుంటుంది.