
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన చిత్రం ‘పరదా’.దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలకపాత్రలు పోషించారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి ‘యత్ర నార్యస్తు’అనే పాటను విడుదల చేశారు. అలాగే ఆగస్టు 22న సినిమా విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌కు సురేష్ బాబు, సత్యదేవ్ అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. ప్రెస్‌మీట్‌లో సురేష్ బాబు మాట్లాడుతూ ‘ట్రైలర్ చూసి షాక్ అయ్యా.. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి చిత్రం తీయడం అంత సులభం కాదు. ఎంతో ప్యాషన్‌తో తీశారు. కొత్త తరహా కథ చెప్పాలనే తపన ఇందులో కనిపించింది. మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం’ అన్నారు. అలాగే హీరో సత్యదేవ్ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
అనుపమ మాట్లాడుతూ ‘బడ్జెట్ వల్ల దీన్ని అంతా చిన్న సినిమా అంటున్నారు కానీ మేము చెప్పదలచుకున్న కంటెంట్ చాలా పెద్దది. ఫైట్స్, పాటలు ఉన్న రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు.. కానీ కమర్షియల్ మూమెంట్స్ ఉన్నాయి. అదేంటో సినిమాలోనే చూడాలి.
ఈ సినిమా ద్వారా ఒక స్టీరియోటైప్‌ను బ్రేక్ చేయడం మా అందరి అల్టిమేట్ గోల్. ఇక ఓ అమ్మాయి ఫొటో పోస్టర్‌గా వచ్చిందంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీ సంస్థలు, ఒక్కోసారి ప్రేక్షకులు కూడా ముందుకురారు. అది ఎంత మంచి సినిమా అయినా అంతే. అది తప్పు అనడం లేదు కానీ అదే వాస్తవం’అని చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేకు మించిన మంచి రిలీజ్ డేట్ తమ చిత్రానికి మరొకటి ఉండదు అని దర్శకుడు చెప్పాడు. నిర్మాతలతో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.